News

ఎపి సియం చంద్రబాబు గైర్ హాజర్


ఆంధ్రప్రదేశ్   తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ ఇచ్చిన ఇప్తార్ విందుకు ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డుమ్మా కొట్టారు.ఆయన డిల్లీలోనే ఉండిపోయారు.కేంద్ర మంత్రులు రాజ్ నాద్ సింగ్, పియూష్ గోయల్ లను కలిసిన తర్వాత ఆయన మీడియా సమావేశంలో పాల‌్గొన్నారు.ఆయన ఇప్తార్ పాల్గొనదలచినట్లు లేదని,అందువల్లే అక్కడే మీడియా సమావేశం పెట్టి ఉండిపోయారని అబిప్రాయపడుతున్నారు.ఇంతకుముందు రాష్ట్రపతి గౌరవార్ధం గవర్నర్ ఇచ్చిన విందుకు చంద్రబాబు హాజరు కాగా, కెసిఆర్ తనకు జ్వరం ఉందని రాలేదు.ఆ తర్వాత రాష్ట్రపతి ఇచ్చిన విందుకు కెసిఆర్ వెళ్లారు.అప్పుడు చంద్రబాబు జపాన్ టూర్ లో ఉన్నారు.తాజాగా శుక్రవారం నాటి ఇప్తార్ కు చంద్రబాబు గైర్ హాజరయ్యారు.దీంతో ఈ ఇద్దరు సి.ఎమ్ లు ఒకరికొకరు ఎదురు పడడానికి కూడా ఇష్టపడడం లేదని అనుకుంటున్నారు.అప్పట్లో టిడిపి యువనేత లోకేష్ ఒక వ్యాఖ్య చేస్తూ చంద్రబాబుకు ఎదురుపడే ధైర్యంలేకే కెసిఆర్ రాలేదని అన్నారు